మధ్యప్రదేశ్‌లోని VIT-భోపాల్ యూనివర్శిటీ వేదికగా పారిశ్రామిక అభివృద్ధి సదస్సు-2024 ప్రారంభమైంది. మరో మూడు రోజుల పాటు ఆగస్టు 3 వరకు జరిగే ఈ సదస్సును రాష్ట్ర మంత్రి చేతన్య కశ్యప్ వర్చువల్ విధానంలో ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. పారిశ్రామిక రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రస్తుతం పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చలు జరిపే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. సమావేశంలో ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక రంగ నిపుణులు పాల్గొంటున్నారు.