మార్కెట్లో స్వచ్ఛమైన తేనెకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు తేనెటీగల పెంపకం వైపు మొగ్గుచూపుతున్నారు. అంతేకాదు, తేనెటీగల పెంపకానికి కొద్దిపాటి పెట్టుబడితో లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ఇక తేనెటీగల పెంపకాన్ని పొలంలో లేదంటే ఇంటి వద్ద పెట్టేలలో చేపట్టవచ్చు. అయితే ఇందుకు ప్రత్యేకమైన పెట్టెలు, పొగడబ్బా, వస్త్రాలు అవసరం అవుతాయి. తేనెతో పాటు మైనానికి కూడా మార్కెట్లో ఎంతో గిరాకీ ఉంటుంది.