రిజర్వేషన్ల చిచ్చు చెలరేగి నెల రోజులుగా బంగ్లాదేశ్ నిరసనలతో భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో నిరసనకారులను అణిచివేసేందుకు భారత సైన్యం వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాలోకి ప్రవేశిస్తోందని కొందరు నెట్టింట ఓ వీడియో షేర్ చేస్తూ ఆందోళన రేకెత్తిస్తున్నారు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఈ వీడియో 2022 నాటిదని, దీనికి బంగ్లాకు ఎలాంటి సంబంధం లేదని, భారత్ నుంచి ఎలాంటి ఆర్మీ వెళ్లట్లేదని స్పష్టం చేసింది.