దుబాయ్ వేదికగా జరిగిన అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కింగ్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 'ఎంత అద్భుతమైన మ్యాచ్. అద్భుతమైన విజయం సాధించిన టీంఇండియాకు అభినందనలు. సెంచరీ చేసిన కోహ్లీకి ప్రత్యేక శుభాకాంక్షలు. అబ్బాయిలు టోర్నమెంట్‌లో మిగిలిన ఆటను కూడా ఇలాగే జోరుగా కొనసాగించండి' అని చంద్రబాబు పోస్ట్ చేశారు.