యూఏఈతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 201 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. 2018లో ఇంగ్లండ్‍పై చేసిన 198 పరుగులే ఇప్పటి వరకు అత్యధిక స్కోరుగా ఉండేది. దానిని ఇవాళ భారత్ బ్రేక్ చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత జట్టు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్‍లో అడుగుపెట్టింది.