పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41 ఈవెంట్ లో భారత అథ్లెట్ నవదీప్ కు బంగారు పతకం లభించింది. తొలుత నవదీప్(47.32 మీటర్లు) రజత పతకాన్ని సాధించాడు. అయితే అనూహ్యంగా స్వర్ణం గెలిచిన ఇరాన్ అథ్లెట్ సదేగ్ బెయిట్ పై(47.64 మీటర్లు) అనుచిత ప్రవర్తన కారణంగా అనర్హత వేటు పడింది. ఈ మేరకు పారాలింపిక్స్ కమిటీ స్వర్ణానికి అప్‌గ్రేడ్ చేసింది. దీంతో పారిస్ పారాలింపిక్స్ లో భారత్ ఏడో బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది.