యూరప్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా క్రేజ్ మామూలుగా లేదుగా (వీడియో)

65చూసినవారు
భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌, పారిస్ ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతర దేశాల్లోనూ అత‌ను భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. వారిలో లేడీ ఫ్యాన్స్ కూడా ఉండటం విశేషం. తాజాగా యూరప్ దేశం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్‌ లీగ్ ఫైనల్ తర్వాత తీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నీరజ్ చోప్రాతో ఫోటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు లేడీ ఫ్యాన్స్ ఎగబడ్డారు.

సంబంధిత పోస్ట్