వాయు కాలుష్యానికి గురైన పురుషులకు సంతానలేమి ముప్పు పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పురుషుల్లో వంధ్యత్వం ఏర్పడే ముప్పు అధికంగా ఉందని డెన్మార్క్ అధ్యయనం పేర్కొంది. ప్రపంచంలోని ప్రతి ఏడు జంటల్లో ఒకటి సంతానలేమి సమస్యతో బాధపడుతోందని, పీఎం 2.5 పురుషులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోందని వివరించింది. 2000-2017 మధ్య డెన్మార్క్‌లో 30 నుంచి 45 ఏళ్ల వయసున్న 5,26,056 మందిపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది.