ఒక్క క్లిక్‌తో మెడికల్‌ కాలేజీల సమాచారం

59చూసినవారు
ఒక్క క్లిక్‌తో మెడికల్‌ కాలేజీల సమాచారం
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల పూర్తి సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో పొందుపరుచాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిర్ణయించింది. ఇప్పటివరకు కాలేజీల ప్రాథమిక వివరాలు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇకపై ఆయా కాలేజీల భవనాలు, మౌలిక వసతులు, సిబ్బంది వివరాలు తదితర సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఎన్ఎంసీ వెబ్‌సైట్‌లోని యాన్యువల్ డిక్లరేషన్ అనే ట్యాబ్/లింక్‌లో ఈ వివరాలు ఉంటాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్