TG: సికింద్రాబాద్ జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి అనే యువతి రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓయూ ఆంధ్ర మహిళా సభ కాలేజీలో భార్గవి ఇంటర్ చదువుతున్నట్లు తెలిపారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.