AP: వైసీపీలో నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటాయని అంటారు. అందుకే నేతలు అసంతృప్తితో ఉంటారని చెబుతారు. ఇక పోతే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంచార్జిలను రెండు రోజుల క్రితం వైసీపీ అధినాయకత్వం నియమించింది. ఈ నేపథ్యంలో చోడవరం నుంచి మూడు సార్లు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి 2019లో గెలిచిన సీనియర్ నేత కరణం ధర్మశ్రీని తప్పించడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.