లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

66చూసినవారు
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇన్ఫోసిస్, హెచ్‌‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్ సూచీలు రాణిస్తున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభంతో, నిఫ్టీ 23,400 మార్క్ పైన ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 77,177 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 23,412 వద్ద కదలాడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్