వరి పంట సాగు చేసిన భూముల్లో నీటి వసతి ఉన్న చోట్ల కొందరు రైతులు నువ్వులు సాగు చేస్తున్నారు. అయితే సరైన విత్తన ఎంపిక, మేలైన యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ పంట నుంచి వచ్చే ఆదాయం బాగుండటంతో పండించే రైతుల సంఖ్య పెరుగుతోంది. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉంది.