ఏపీలోని పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు.. ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టు డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. నేటి నుంచి జులై 3వరకు ప్రాజెక్టు సైట్‌లో పనులను నిపుణులు పరిశీలిస్తారు.