ఐపీఎల్ 2025 సీజన్‌కు సమయం దగ్గరపడుతోంది. మార్చి 21 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అయితే, ఈసారి హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్ తెలిసింది. ఐపీఎల్ 2025 సీజన్‌లోని రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. క్వాలిఫయర్ 1తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌లూ ఇక్కడే నిర్వహించనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.