టెహ్రాన్‌లో హమాస్ నేత ఇస్మాయిల్ హనియా (62) హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. హనియా మృతి నేపథ్యంలో బుధవారం ఇరాన్ భద్రతా మండలి అత్యవసరంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే ఆయన ఆదేశాలిచ్చినట్లు కీలక అధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది.