'గగన్‌యాన్' ద్వారా నలుగురు వ్యోమగాములతో పాటు డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ (ఫ్రూట్ ఫ్లై) జాతికి చెందిన 20 ఈగలను అంతరిక్షంలోకి ఇస్రో పంపనుంది. వీటి విసర్జన వ్యవస్థ మానవుని విసర్జన వ్యవస్థతో దాదాపు 77% పోలి ఉంటుంది. వ్యోమగాముల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పు ఎక్కువ. అంతరిక్షంలో ఈ ఈగలలోనూ రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లను అధ్యయనం చేస్తే వ్యోమగాముల ఆరోగ్యంపై మరింత స్పష్టత రావొచ్చని ఇస్రో భావిస్తోంది.