తాజా పండ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం చాలా మంచి అలవాటని నిపుణులు చెబుతున్నారు. రోజూ టిఫిన్‌గా ఇడ్లీ, దోశ తదితరమైనవి తినడం ఎక్కువమందికి అలవాటు. దీని వల్ల అరగంటలోనే మధుమేహం పెరిగిపోతుందని జీర్ణకోశ వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికి ముందుగా ఏదైనా ఒక పండును తింటే టిఫిన్ తర్వాత షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని సూచిస్తున్నారు. పండ్లలో ఉండే పీచు పదార్థం కారణంగా ఆ తర్వాత తిన్న టిఫిన్ కూడా సులువుగా జీర్ణమవుతుందంటున్నారు నిపుణులు.