బెగరికంచను నాలుగో సిటీగా తమ ప్రభుత్వం నిర్మించనుందని సీఎం రేవంత్ తెలిపారు. దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ నగరాలను మించిన సిటీగా బెగరికంచను నిర్మిస్తామని సీఎం పేర్కొన్నారు. బెగరికంచకు మెట్రో తీసుకువచ్చే బాధ్యత నాది.. 4 ఏళ్ళు తిరిగేలోపు ఇక్కడ ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తామని సీఎం తెలిపారు. విమానం కొనాలన్నా విమానం ఎక్కాలన్నా ఇక్కడ నుంచే అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ అన్నారు.