తమిళ స్టార్ హీరో అజిత్.. ఇకపై తనను 'కడవులే.. అజితే' అని పిలవడం ఆపాలని అభిమానులను కోరాడు. తనను అలా అనడం ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. తన పేరు ముందు ఎలాంటి పదాలను ఉంచి పిలవొద్దని సూచించాడు. కాగా, కడవులే.. అంటే తమిళంలో దేవుడని అర్థం. ప్రస్తుతం అజిత్.. తిరుమేని దర్శకత్వంలో 'విడాముయార్చి' మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.