తప్పు కోహ్లీది కాదు పిచ్‌ది: హర్భజన్

56చూసినవారు
తప్పు కోహ్లీది కాదు పిచ్‌ది: హర్భజన్
టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఫామ్ లేమికి కారణం ఇప్పటి వరకు ఆడిన పేలవమైన పిచ్‌లేనని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. 'విరాట్ సహా ఆ పిచ్‌లపై ఆడిన ఏ బ్యాటర్‌నూ తప్పుపట్టలేం. వాటిపై ఆడటం కష్టంగా కనిపించింది. అలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఫామ్‌ను అంచనా వేయకూడదు. తన నుంచి పరుగుల్ని ఆశిస్తాం కరెక్టే కానీ పరిస్థితుల్నీ చూడాలి కదా. సూపర్-8లో కోహ్లీ ఫామ్ అందుకుంటారు' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్