ప్రధాని నరేంద్ర మోదీ 74వ పుట్టినరోజు సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శుభాకాంక్షలు తెలిపారు. భారత్-ఇటలీ సంబంధాలపై ఇటాలియన్ ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. "భారత ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటలీ, భారతదేశం మధ్య స్నేహాన్ని ఇంకా బలోపేతం చేస్తూ, మనకు ఎదురయ్యే ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసి కొనసాగుతామని ఆశిస్తున్నాను" అని ఆమె రాసింది.