జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత కొన్ని రాశుల వారికి అదృష్టం యోగమని పండితులు చెబుతున్నారు. మేష రాశి వారు ఉద్యోగ, వ్యాపారాల్లో రాణించి ఆర్థిక వృద్ధి సాధిస్తారు. కర్కాటక రాశి వారికి విదేశాలు వెళ్లే అవకాశం ఉంది. తులా రాశి వారు ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారని, కుటుంబంలో శుభకార్యాలు జరగొచ్చని అంటున్నారు. మకర రాశి వారికి వ్యాపార, ఉద్యోగ వృద్ధి, కుటుంబంలో శాంతి కలుగుతుందంటున్నారు.