ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం సందర్శించారు. ధర్మారం మండలంలోని దొంగతుర్తి, ధర్మారం, మల్లాపూరు గ్రామాల్లో నెలకొల్పిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితులను పరిశీలించారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు రైతులు తమ ధాన్యాన్ని నేరుగా అమ్ముకోవాలని కలెక్టర్ సూచించారు.