జగిత్యాల జిల్లాలోని సారంగరాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలోని 23 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్ లత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు విషయంలో ఎలాంటి అవకతవకులు జరగకుండా చూడలని అధికారులను ఆదేశించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మ్యాచరు వచ్చిన వెంటనే తూకం వేయాలని అధికారులను సూచించారు.