రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ఈ సాలియా నాయక్ బుధవారం తెలిపారు. గడిచిన సంవత్సర కాలంగా గరిష్ట డిమాండ్ ఉన్న సమయంలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‍ల పై లోడ్ భారం ఎంత ఉందో రీడింగ్ తీసుకొని కొత్తగా 203 ట్రాన్స్‌ఫార్మర్లు, లోడ్ ఎక్కువ ఉన్న చోట 156 ట్రాన్స్‌ఫార్మర్‍ల సామర్ధ్యాన్ని పెంచుతున్నామన్నారు.