జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు నోటేబుక్స్, పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గ్రేటర్ కోరుట్ల అధ్యక్షులు కొత్త సునీల్, ప్రధాన కార్యదర్శి రేగొండ శిరీష్, కోశాధికారి బాశెట్టి చైతన్య, వాసవి క్లబ్ ప్రతినిధులు ఎలిమిల్ల మనోజ్, రావికంటి పవన్, మానుక రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులు మోటూరి ప్రవీణ్ కుమార్, వాసవి వనిత క్లబ్ ప్రతినిధులు నీలి లక్ష్మి, బూస మాధురి, పుత్తూరి భాగ్యలక్ష్మి, జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్త సురేష్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త సుధీర్, మంచాల జగన్, అల్లాడి ప్రవీణ్, గరిపెళ్లి శ్రీనివాస్, క్లబ్ మాజీ అధ్యక్షులు అల్లాడి మహేష్, ముక్క చిన్న ధర్మరాజు, కోటగిరి రాజశేఖర్, మేడి కిషన్, నీలి శ్రీనివాస్ ఎన్ ఎల్ కె, జలంధర్, ఉత్తురి మారుతి, కొత్త వాసు, కొత్త గణేష్ ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.