కథలాపూర్ మండల కేంద్రంలో రూ. 1. 30 కోట్ల వ్యయంతో నిర్మించబోయే రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన అప్పటి పాలకులు పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల అవస్థలు అర్థం చేసుకొని రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేపడుతున్నామన్నారు.