సదర్ఘాట్ వద్ద గేట్ల నిర్మాణం కారణంగా గోదావరిలో నీరు లేక గోదావరి నది లిఫ్ట్ పై ఆధారపడి వేలాది ఎకరాలు సాగు చేసుకునే రైతులు ఆందోళన పరిస్థితిలో ఉన్నారు. ఇట్టి విషయం గురించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా హైదరాబాద్ లో మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి పోచంపాడు ప్రాజెక్టు ద్వారా గాని, కడెం ప్రాజెక్టు ద్వారా గాని ఒక టీఎంసీ నీటిని గోదావరిలో వదలాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు.