AP: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో శుక్రవారం జరగనున్న జనసేన 12వ ఆవిర్భవ సభకు సర్వం సిద్ధమైంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు లక్షల సంఖ్యలో తరలివచ్చేలా జాతీయ రహదారి పక్కనే 50 ఎకరాలలో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. 250 మంది వరకు కూర్చునేలా వేదిక సిద్ధం చేశారు.1500 మందికి పైగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.