జపాన్‌ చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్‌ ప్రయోగం విఫలం

79చూసినవారు
జపాన్‌ చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్‌ ప్రయోగం విఫలం
జపాన్‌ చేపట్టిన తొలి ప్రయివేటు రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌లో చోటు చేసుకొంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉప గ్రహాన్ని తీసుకొని నింగికి ఎగిరింది. కానీ, కొన్ని క్షణాల్లోనే ఇది పేలుడుకు గురై గాల్లోనే అగ్నిగోళంలా మారిపోయింది. దీని శకలాలు చూట్టూ ఉన్న పర్వత పాదాలపై పడ్డాయి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్