రన్నింగ్‌లో ఊడిన జీపు టైరు (వీడియో)

56చూసినవారు
కేరళలోని వయనాడ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. మే 13న బుల్ పాయింట్ ప్రాంతానికి కూలీలతో కూడిన జీపు వెళ్తోంది. మార్గమధ్యంలో అకస్మాత్తుగా జీపు టైరు ఊడిపోయింది. ఆ టైరు రోడ్డు పక్కనే ఉన్న బారికేడ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఆ సమయంలో మరో వాహనం ఎదురుగా రాకపోవడం, జీపు కూడా తక్కువ వేగంతో ప్రయాణిస్తుండడంతో ప్రమాదం తప్పింది. కూలీలంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్