రైలులో సెర్వ్ చేసిన రైతాలో జెర్రి

68చూసినవారు
రైలులో సెర్వ్ చేసిన రైతాలో జెర్రి
రైలులో ఆహార పదార్థాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇటీవల వందే భారత్ లాంటి రైళ్లలో కూడా క్వాలిటీ లేని ఆహార పదార్థాలను చూశాం. తాజాగా అటువంటి చేదు అనుభవమే ఓ ప్రయాణికుడికి ఎదురైంది. అతడికి సెర్వ్ చేసిన రైతాలో జెర్రి కనిపించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఐఆర్‌సీటీసీని ప్రశ్నించాడు. VIP ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఇలాంటి ఆహారం వడ్డిస్తే ఇక సాధారణ రైళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని రాసుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్