ఏపీలోని విశాఖకు చెందిన యర్రాజి జ్యోతి అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో బరిలోకి దిగుతోంది. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడనున్న మొదటి భారత అథ్లెట్‌గా ఆమె రికార్డులకెక్కింది. వరల్డ్ ర్యాంకింగ్స్ కోటాలో పారిస్ బెర్త్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఆమె ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో 10 పతకాలు, రెండు కామన్వెల్త్ పతకాలు, ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించింది.