కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ రామలక్ష్మణుల్లా ఉన్నారని విజయశాంతి అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. అన్నదమ్ముల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలని, అభిమానుల కోసం మరిన్ని గొప్ప సినిమాలు చేయాలని పేర్కొన్నారు.