బాన్సువాడ మండలం బోర్లo గ్రామంలోని రెడ్డి సంఘంలో ప్రతిష్టించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి గణేశుని వద్ద 20 కిలోల లడ్డు ప్రసాదంగా ఉంచి నిత్య పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గణేష్ మండలి నిర్వాహకులు ప్రశాంత్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ గణేష్ ని ప్రతిష్టించిన ప్రతి సంవత్సరం నుండి సంవత్సరానికి కిలో చొప్పున పెంచుతూ లడ్డును ప్రసాదంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.