కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన చిట్టెంపల్లి రాములు కుమారుడు కిరణ్ ఇటీవల ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాలలో ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం పొందారు. ఈ సందర్భంగా కిరణ్ కు గ్రామస్తులు శనివారం అభినందనలు తెలిపారు.