కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఈ నెల 9న చలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయ్యాలని ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు మెక్కా సాయి మాదిగ మంగళవారం అన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేసే దిశగా తెలంగాణ సర్కార్ ముందుకు రావాలని, ఎస్సీ వర్గీకరణ అమలయ్యాక టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగాల భర్తీ చేయడం అన్యాయమని అన్నారు. నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.