హైదరాబాదులోని చింతల్ ఆగ్రో వర్క్ షాప్ లో నిర్వహించిన ఆయుధ పూజలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆయుధాలను పూజించడం మన సంస్కృతి అని, ఆగ్రో సంస్థను లాభాల బాటలో తెచ్చేందుకు కృషి చేసేందుకు దేవుని కృప ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.