బాన్సువాడ పట్టణంలోని భాగ్వన్ సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మొహమ్మద్ కాజీమ్, ఉపాధ్యక్షులుగా మొహమ్మద్ ఫాజిల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా నియామకమైన మొహమ్మద్ కాజీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షులు మాట్లాడుతూ నాపై నమ్మకంతో మల్లొకసారి భాగ్వన్ సంఘం అధ్యక్షులు గా ఎన్నుకున్నందుకు నియమించిన పెద్దమనుషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.