తిర్మలపూర్ లో ఘనంగా బోనాల పండుగ

986చూసినవారు
తిర్మలపూర్ లో ఘనంగా బోనాల పండుగ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం ఆషాడ మాసం సందర్భంగా ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో తలపై బోనం ఎత్తుకొని పెద్దమ్మ తల్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పాడి, పంటలతో గ్రామం అభివృద్ధి చెంది అందరూ చలంగా ఉండాలని అమ్మవారిని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని కుల పెద్దలు, గ్రామ ప్రజలు మరియు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్