నసురుల్లాబాద్ మండలంలోని మైలారం, నాచుపల్లి, నెమ్లి గ్రామాల్లో ఆదివారం భారతీయ జనతా పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.