సులేమాన్ నగర్ లో ఉచిత పశు వైద్య శిబిరం

67చూసినవారు
సులేమాన్ నగర్ లో ఉచిత పశు వైద్య శిబిరం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. 20 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స, రెండు కృతిమ గర్భాధారణ, 13 సాధారణ చికిత్సలు చేశారు. 22 పశువులకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్, కోటగిరి మండలాల పశు వైద్యాధికారులు సంతోష్ రెడ్డి, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్