కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రములోని బీసీ బాలుర వసతి గృహంలో వంట సిబ్బంది సక్కుబాయ్ పాము కాటుకు గురై బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతుoది. దసరా సెలవులు ముగియడంతో వసతి గృహం తెరుచుకొవడంతో మంగళవారం వసతి గృహo ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగిస్తుండగా ఆమె పాముకాటు గురైoది.
గత నెల 10 న పాము కాటుకు గురై సాయిరాజ్ ఐదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. అలాగే వసతి గృహంలో పరిసరాలను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు జ్యోతి సైతం పాము కాటుకు గురైoది. నెల వ్యవధిలో బీర్కూర్ బీసీ వసతి గృహంలో ముగ్గురు పాము కాటు కు గురయ్యారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం. పిల్లల తల్లిదండ్రులు హాస్టల్ లో పిల్లల్ని ఉంచాలా వద్దా అని ఆందోళన లో ఉన్నారు. హాస్టల్ పరిసరప్రాంతాలు శుభ్రంగా ఉంచకపోతే తగిన మూల్యం తప్పదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.