కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజనీతి శాస్త్ర అధ్యాపకులు నర్సింలు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద అత్యున్నతమైన రాజ్యాంగం మనదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.