ధ్యానం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ధ్యానంతోనే మనిషికి మానసిక ప్రశాంతత దొరుకుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ధ్యాన దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు చిన్ననాటి నుండి ధ్యానం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.