కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం కాళోజి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అసద్ ఫరూక్ మాట్లాడుతూ కాళోజి తెలంగాణ యాస, భాషతో పాటు తెలంగాణ ఉనికి కోసం ఎంతో పాటుపడిన మహనీయుడు అని పేర్కొన్నారు.