బోర్లంలో వాటర్ ట్యాంకు ద్వారా నీటి సరఫరా

78చూసినవారు
బోర్లంలో వాటర్ ట్యాంకు ద్వారా నీటి సరఫరా
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకు ద్వారా గ్రామంలోని పలు వార్డులలో నీటిని సరఫరా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లు వచ్చేటట్లు అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్