అదానీపై జేపీసీ విచారణ, మణిపూర్ లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మోడీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టామని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం మండలి వద్ద మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ అండదండలతో అదానీ దేశంలోని వ్యవస్థలను, బ్యాంకులను మభ్య పెడుతున్నారని అన్నారు.