బిచ్కుంద సొసైటీలో సోమవారం 57వ మహాజన సభ జరిగింది. ఇందులో భాగంగా సొసైటీ అధ్యక్షులు నాల్చారు బాలాజీ వార్షిక నివేదిక జమ ఖర్చుల పట్టికలను పరిశీలించి ఆమోదించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చెల్లించాలని తీర్మానం చేశారు. రభీలో భాగంగా శనగ 25కిలో బస్తా ధర రూపాయలు 2250. పల్లీలు రూ 1450 లకు పంపిణీ చేస్తామని సోసైటీ చైర్మన్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన సంఘ కొత్త బైలాను ఆమోదించారు.